తెలుగు తేజం : అర్హులైన ప్రతి ఒక్క పేదవానికి గూడు కల్పించాలనే దృఢ సంకల్పంతో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టిని 30 లక్షల ఇల్లు స్థలాలు పంపిణీ చేసే సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు అభినందిచదగిన విషయమన్ని పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమా సురేష్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణ వైసీపీ అధ్యక్షుడు వేమా సురేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 లక్షల ఇల్లు స్థలాలు ది.25-12-2020 శుక్రవారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వేమా సురేష్ బాబు తెలిపారు. శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆదేశాల ప్రకారం కంచికచర్ల పట్టణంలో సుమారు 38 ఎకారలలో 1403 మంది లబ్ధిదారులకు ఇల్లు స్థలాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతిష్టాత్మకమైన ఇల్లు స్థలాలు పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు చేతులమీదుగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు జుజ్జూరు రోడ్డు నాగేంద్ర స్వామి గుడి వెనుక వైపు ఉన్న ఇల్లు ఫ్లాట్ లో పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ అధ్యక్షుడు వేమా సురేష్ బాబు, బండారు పల్లి శబరి, అబ్బూరి నాగమల్లేశ్వరరావు, వేముల గోపి, ఇల్లు ఫ్లాట్ లో జరిగే పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల, రెవెన్యూ, పంచాయతీ, సచివాలయం ఉద్యోగులు,వాలింటరీలు, వివిధ శాఖల అధికారులు పోల్గోంటారని, లబ్దిదారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొని ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వేమా సురేష్ బాబు కోరారు.