నూతన కమిటీ 10 మంది తో ఎన్నిక
తెలుగు తేజం, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం-మైలవరం ఆటో డ్రైవర్స్ & వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం ) జనరల్ బాడీ సమావేశం శుక్రవారం కామ్రేడ్ ఎ.విఠల్ రావు అధ్యక్షత న ఇబ్రహీంపట్నం కామ్రేడ్ వెలగా లక్ష్మణరావు భవన్ , సిఐటియు ఆఫీసు నందు జరిగింది. ఈ సంధర్భంగా సిఐటియు మండల కార్యదర్శి యం.మహేష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్స్ అందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని , ఇటీవల తీసుకోచ్చిన మోటార్ వెహికిల్ చట్టాన్ని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోచ్చిన జి.ఓ నెం. 21 ను ఉపసంహారించుకోవాలని , ఆటో డ్రైవర్స్ కు ఇబ్బంది కలిగించే ఫైన్స్ లాంటివి వేయవద్దని , తప్పనిసరి గా నియమాలను కట్టుదిట్టం పేరుతో డ్రైవర్స్ ని అసౌకర్యం కలిగించకుండా చేయాలని కోరారు. ఇబ్రహీంపట్నం నుండి మైలవరం వైపు వేళ్ళే ఆటో స్టాండ్ డ్రైవర్స్ క్రమపద్ధతిలో గత 30 సం” నుండి యూనియన్ నడుస్తోందని తెలిపారు.
ఈ సందర్బంగా ఇబ్రహీంపట్నం ఆటో డ్రైవర్స్ & వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఆటో వర్కర్స్ యూనియన్ (ఇబ్రహీంపట్నం – మైలవరం రూట్) గౌరవ అధ్యక్షులుగా యం.మహేష్ , అధ్యక్షులుగా జి.యలమంద (యేసు), కార్యదర్శిగా, యం.విజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్గా బత్తుల (గడ్డం) శ్రీను ,రంగ, జాయింట్ సెక్రటరీగా మందా రమేష్ ఎన్నికయ్యారు. ఆటో వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం ఇబ్రహీంపట్నం కామ్రేడ్ వెలగా లక్ష్మణరావు భవన్ , సిఐటియు ఆఫీసు నందు జరిగింది.