తెలుగు తేజం, విజయవాడ: ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్ వ్యాధి బారి నుంచి ప్రజలకు టీకా అందించడం ద్వారా త్వరలో విజయం సాధించబోతున్నామని హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. విజయవాడ కనకదుర్గమ్మను మంగళవారం గవర్నర్ దర్శించుకున్నారు. విజయవాడ, గుంటూరు జిల్లాల పర్యటన నిమిత్తం వచ్చిన దత్తాత్రేయ ఈ ఉదయం అమ్మవారి సేవలో పాల్గొన్నారు. గవర్నర్‌కు రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఈవో సురేశ్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ… హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కనకదుర్గమ్మను దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. యావత్ సమాజాన్ని కరోనా మహమ్మారి చిన్నాభిన్నం చేసిందని దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అలజడి సృష్టించిందని.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్నింటినీ అతలాకుతలం చేసిందన్నారు. వైరస్‌పై త్వరలో గొప్ప విజయం సాధించబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. అమ్మవారిని తాను వేడుకున్నది కూడా ఇదేనని చెప్పారు. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ దేశీయంగా ‘కొవాగ్జిన్’ టీకా రూపొందించడం ప్రశంసనీయమన్నారు. ఈ టీకా దేశ ప్రజలందరికీ సక్రమంగా అంది అంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రమణ గొప్ప మార్పునకు నాంది కావాలని అభిప్రాయపడ్డారు. రైతుల జీవితాల్లో ఇంకా గొప్ప వెలుగులు రావాలని, అన్నదాతలను భగవంతుడు అన్ని విధాలా అభివృద్ధిలో ముందుకు తీసుకురావాలని ఆకాంక్షించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవసాయంలో రెట్టింపు ఆదాయం చేయాలనే సంకల్పం నెరవేరాలని ఆ భగవంతుడిని