తెలుగు తేజం, గొల్లపూడి : తమ పోరాటాన్ని ప్రభుత్వం అవహేళన చేసినా మొక్కవొని దీక్షతో ముందుకు సాగి అమరావతిని కాపాడుకుంటామని ఉద్దండరాయినిపాలెం రైతులు, మహిళలు స్పష్టం చేశారు. శుక్రవారంనాడు గొల్లపూడి కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఉద్దండరాయనిపాలెం రైతులు, మహిళలు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ మేరకు దేవినేని ఉమా మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు పిలుపుతో 34వేల ఎకరాలిచ్చిన 29వేల రైతుకుటుంబాలు 402 రోజులుగా ఉద్యమిస్తుంటే సీఎం జగన్ కు కనబడటం లేదా అని విమర్శించారు. “మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు” “ప్రభుత్వ మొండివైఖరి నశించాలి” “వుయ్ వాంట్ జస్టిస్” అంటున్న చిన్నారి నిర్విజ్ఞ మాటలు తాడేపల్లి రాజప్రసాదానికి వినపడడం లేదా? వైయస్ జగన్మహన్ రెడ్డి అని ప్రశ్నించారు. అమరావతి పోరాటం కేవలం రాజధానివాసులే కాకుండా రాష్ట్రం ప్రజలంతా కలిసి రావాలని రైతులు మహిళలు పిలుపునిచ్చారు.