తెలుగు తేజం, మోపిదేవి : వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వసంతోత్సవం, అవభృద స్నానోత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార శర్మ, వేదపండితులు కొమ్మూరి ఫణిశర్మ బ్రహ్మత్వంలో స్వామికి వసంతోత్సవం జరిపారు. ఈవో జి.వి.డిఎన్.లీలాకుమార్ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించగా, అర్చక బృందం పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. అనంతరం మహ పూర్ణాహుతి శాస్త్రోక్తంగా జరిపారు. ఎస్టేట్ దేవాలయాల పర్యవేక్షకులు మధుసూదనరావు, చెన్నకేశవ, ఆలయ ఉద్యోగులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సుబ్రహ్మణ్యేశ్వర దీక్ష విరమణ శాస్త్రోక్తంగా జరిగింది. పలు ప్రాంతాలకు చెందిన 55 మంది భక్తులు పాలకావిళ్లతో పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించి స్వావి సన్నిధిలో దీక్ష విరమణ గావించారు. కల్యాణ మహోత్సవాల్లో భాగంగా వేదపండితులు విచ్చేసి వేద ఘోష నిర్వహించారు. ఈవో జి.వి.డిఎన్.లీలాకుమార్, నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ వేద పండితులను సత్కరించి ప్రసాదాలు అందించారు.