తెలుగుతేజం, వత్సవాయి (ప్రతినిధి) : వత్సవాయి మండల కేంద్రంలో స్థానిక సచివాలయం 2 వద్ద రైతు శిక్షణ కేంద్రం వద్ద విజయవాడ వారిచే వరి మరియు మొక్కజొన్న పంటల సాగు పద్ధతి పై మండలంలోని రైతులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గరికపాడు కె.వి.కె సి కో ఆర్డినేటర్ శ్రీ డా!! కె వసంత భాను మాట్లాడుతూ విత్తనం శుద్ధి చేసుకోవడం వల్ల పంట 30 రోజుల వరకు పురుగు మరియు తెగుళ్ల నుంచి రక్షణ ఉంటుందని తెలిపారు. పత్తిలో గులాబీ రంగు కాయ తొలుచు పురుగు నివారణ 60 రోజుల సమయములొ లింగాకర్షక బుట్టలు ఎకరాకు 4 చొప్పున ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. వేప నూనె వాడడం వల్ల రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గుతుందని మరియు వివిధ రకాల వైరస్ ల బారిన పడే అవకాశం తగ్గుతుందని తెలిపారు. మొక్కజొన్న కత్తెర పురుగు నివారణకు ప్రోక్లెయిమ్ మందులను వాడినచో ఆశాజనకమైన ఫలితాలు ఉన్నట్లు తెలిపారు. డి ఆర్ సి, డి డి ఏ కె జ్యోతి రమణి మాట్లాడుతూ రైతులకు ఏ విధమైన సమస్యలున్నా155251 కాల్ సెంటర్ కు ఫోన్ చేసినచో శాస్త్రవేత్తలు అన్ని పంటలకు సంబంధించిన పురుగులు మరియు తెగుళ్ల యాజమాన్యంపై తగిన సలహాలు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ డి ఎ, ఎఫ్ టి సి, కె జ్యోతిర్మయి, ఏ ఓ, ఎఫ్ టి సి, యం ఉషాకుమారి, వత్సవాయి మండల వ్యవసాయ అధికారి వి రవి కుమార్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గాదెల రామారావు, అన్ని గ్రామాల రైతులు మరియు వి ఏ ఏ, వి హెచ్ ఏ, లు పాల్గొన్నారు.