జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు తనదే బాధ్యత అన్న కేటీఆర్
తెలుగు తేజం, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన కలం వీరులకు రుణపడి ఉంటామని మున్సిపల్ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని జలవిహార్ లో జరిగిన మరణించిన జర్నలిస్టు కుటుంబ సభ్యులకు చెక్కుల పంపిణీ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి జర్నలిస్టులకు ఉన్న బందం పేగుబంధం అని, రెండు దశాబ్దాల క్రితం టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన నెలరోజుల్లో జర్నలిస్టులను ఏకం చేసి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఉద్యమ నాయకుడు అల్లం నారాయణ అని అన్నారు. పోరాట పోరాటం కోసము ప్రజల్లో ఉన్న బలమైన కోరికను తమ పత్రికల గొంతు ద్వారా, రాష్ట్రం వచ్చినంక జర్నలిస్టుల సమస్యల కోసం నిర్విరామంగా పోరాటం చేస్తున్నది అల్లం నారాయణ అని గుర్తు చేశారు. రెండు రోజుల వ్యవధిలో జర్నలిస్టుల సమావేశం ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదని జర్నలిస్టుల పటుత్వాన్నికి,సమిష్టి, సంఘటిత శక్తి కి నిదర్శమని అన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు లో పూర్తి బాధ్యత అని కేటీఆర్ పేర్క