తెలుగు తేజం, విజయవాడ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు దేవినేని నెహ్రూ 4 వ వర్థంతి సందర్భంగా ఆయన తనయుడు వైఎస్సార్ సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ఘన నివాళులు అర్పించారు.శనివారం ఉదయం గుణదాల వంతెన సెంటర్లో ఉన్న నెహ్రూ విగ్రహానికి పూలమాలలు సమర్పించిన అనంతరం వైఎస్సార్ సీపీ నాయకులు, దేవినేని అభిమానులు తో కలసి నెహ్రూ ఘట్ కు చేరుకున్న అవినాష్ ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుక్షణం పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి నెహ్రూ అని జిల్లాలో ఎవరికి సాధ్యం కాని విధంగా ఐదు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికై సేవ చేసిన ఘనత ఆయినది అని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నమ్మిన వారికి అండగా నిలబడిన వ్యక్తిత్వం ఆయన సొంతం అని కొనియాడారు. నగర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు ఏర్పాటు చేసిన సామాజిక సేవ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలను అవినాష్ ప్రారంభించారు. పటమాట సెంటర్ లో యూ.యస్.ఓ.రాష్ట్ర అధ్యక్షులు కొరివి చైతన్య, చిమాట బుజ్జి ల ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నెహ్రూ అభిమానులు వారి వారి ప్రాంతలలో చీరల పంపిణీ, అన్నదాన కార్యక్రమలు,అనేక సేవ కార్యక్రమంలు నిర్వహించారు అని, అలాంటి అభిమానులను నాకు తోడుగా ఇచ్చినందుకు చాలా గర్వంగా ఉందని అవినాష్ తెలిపారు. నెహ్రూ స్పూర్తితో ఆయన మీద అభిమానంతో జిల్లా వ్యాప్తంగా పేద ప్రజలకు తోడుగా సేవ కార్యక్రమంలు చేపట్టిన అభిమానులు అందరికి ధన్యవాదాలు తెలిపారు. నేడు భౌతికంగా నెహ్రూ మన మధ్య లేకపోయినా అభిమానులు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచివున్నారు అని,వారికి ఎల్లప్పుడూ నేను అండగా ఉంటానని ఉద్ఘాటించారు. నెహ్రూ చూపిన బాటలో నడుస్తూ నిరంతరం ఆయన ఆశయసాధనకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు, నగర పార్టీ అధ్యక్షులు బొప్పన భవకుమార్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం,డివిజిన్ కార్పొరేటర్ లు, నెహ్రూ అనుచరులు, విద్యార్థి నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.