తెలుగు తేజం, విజయవాడ : కృష్ణా జిల్లా లో కరోనా వైరస్ త్వరితంగా వ్యాప్తి
చెందుతున్నందున జిల్లాలో అందరూ కరోనా వైరస్ నియాత్రణ కోసం నిబంధనలు పాటించవలసినదిగా కలెక్టర్, జిల్లా మేజిస్టేట్, కృష్ణా జిల్లా వారు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ముఖానికి తప్పనిసరిగా ముక్కు, నోరు పూర్తిగా కవర్ చేసే విధముగా మాస్కు ధరించవలెను. చేతులు ఎప్పటికప్పుడు సబ్బుతో గాని శానిటైజర్ తొగానిశుభ్రపరచుకోవలెను. ప్రజలందరూ భౌతిక దూరము పాటించాలని, బహిరంగ ప్రదేశాలు, షాపులు, ఇతర వాణిజ్య ప్రదేశాలలో ముఖానికి మాస్కులు ధరించని వారికి రూ. 500 జరిమానా, మాల్స్, సినిమా హాల్, ఫంక్షన్ హాల్ (100 మంది అంతకంటే ఎక్కువ జనాభా సంచరించు ప్రదేశాలు) నందు రూ.1000 జరిమానా విధించుటకు జిల్లాలో పోలీస్, పంచాయతీ, మున్సిపల్, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. షాపులు, వాణిజ్య ప్రదేశాలు, సినిమా హాల్స్ , మాల్స్ ,
ఫంక్షన్ హాల్స్ , రైతు బజార్లు , జిమ్ సెంటర్లు తదితర ప్రాంతాలలో ముఖానికి మాస్కు ధరించకుండా వచ్చిన వారికి వర్తక వాణిజ్య సంస్థల యజమానులు రూ.10 లకు మాస్కు
అందజేయవలసినదిగా తెలియజేశారు. అంతేకాకుండా విజయవాడ నగరంలో పి.డబ్ల్యు.డి. గ్రౌండ్స్ (స్వరాజ్ మైదానం ) నందు నిర్వహించుచున్న విజయవాడ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అనుమతులను కరోనా వైరస్ అదుపుదల కోసం రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
అంతేకాకుండా మాస్క్ లేని కస్టమర్ లను షాప్ లోనికి అనుమతిస్తే పెనాల్టీ తప్పదని షాపులలో కొనుగోలుకు వచ్చిన కస్టమర్ లు తప్పకుండా మాస్క్ ధరించేటట్లు చూడవలసిన బాధ్యత ఆ షాప్ యజమనిదే. మాస్క్ లేకుండా షాపులలో కస్టమర్ ఉంటే షాప్ యజమానికి పెనాల్టీ వేయబడునని . చిన్న షాపులకు 500 రూ.పెద్ద షాపులకు 1000 రూపాయిలు పెనాల్టీ
విధించబడును. మాస్క్ లేని వారికి కూడా రూ.500 పెనాల్టీ విధిస్తామని ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, రెవిన్యూ, పోలీస్, మునిసిపల్
శాఖల వారికి ఆదేశాలు పంపారు. ఉల్లంఘించిన వారిపై ఐపీసీ 188, డిసాస్టర్ మానేజ్మెంట్ యాక్ట్, 2005 సెక్షన్ 51 నుండి 50 ప్రకారం లీగల్ చర్యలు తీసుకొనబడునని తెలిపారు.