లేనివారికంటే ఉన్న వారే అధికంగా అర్హులు
అడిగితే సమాధానం చెప్పని తహశీల్దార్
ఇబ్రహీంపట్నం,( తెలుగు తేజం ప్రతినిధి)
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల తహశీల్దార్ కార్యాలయంలో అధికారుల పనితీరు ఠాగూర్ సినిమా ను తలపించే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని పథకాలు పెట్టిన, నిజమైన అర్హులు కంటే అనర్హులకు ప్రభుత్వ పథకాలు లబ్ది చేకూరుస్తున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రజల తలరాతలు మార్చడంలో ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా చేకూరింది . ప్రజల గుండెచప్పుడు అయినా వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కనీసం పేదవాడి ఆశలు , కన్నీళ్లు, కన్నకలలు నెరవేరుతాయని భావించింది ప్రజలు వైయస్ ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ప్రజలు కల్పించారు. అదే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలు ఆయన మీద పెట్టుకున్న ప్రతి కలను, ఆశలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ముందుకు కొనసాగుతున్నారు. అదే క్రమంలో కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకునే విధంగా పనిచేస్తూ వారికి అవసరమైన ప్రభుత్వం పథకాలను కూడా అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రతి మండలంలోని పేదవాడికి అందాల్సిన ప్రభుత్వ పథకాలు అందే విధంగా స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అధికారులకు ఎప్పటికప్పుడు హెచ్చరించిన కూడా స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకోక పోవడం చేత అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పేదవాడి ఇంటి కల నెరవేరుతుంది అన్న ఆశతో ఉన్న అర్హులకు నిరాశనే మిగిల్చింది. స్థానిక ఇబ్రహీంపట్నం రెవెన్యూ అధికారులు నిజమైన అర్హులకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను కూడా రానీయ్య కుండా ఆపివేయటం వెనక కారణాలు ఏమిటి అనే విషయం ప్రజలకు అనుమానంగా మిగిలిపోయింది. లిస్టులో వచ్చిన నిజమైన అర్హులను తొలగించి ఉన్నవారికి మరలా ఇళ్ల స్థలాలు ఏమిటి అని అధికారులను ప్రజలు ప్రశ్నిస్తే వారికి అధికారులు సమాధానం కూడా చెప్పలేని పరిస్థితుల్లో రెవిన్యూ అధికారులు ఉండటం చేత ఎవరి వద్దకు వెళ్లాలి అనే ఆలోచనలో ప్రజలు సతమతమవుతున్నారు. ఎంతో కష్టపడి రాత్రనకా పగలనకా ఎండనకా వాననకా పనిచేస్తున్న మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఎన్నోసార్లు నిజమైన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ళ స్థలం వచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది అని సూచించిన కూడా రెవెన్యూ అధికారులు మాత్రం పేదవాడు అంటే చులకనగా చూస్తున్నారని, లిస్ట్ లో వచ్చిన పేర్లను ఎందుకు తొలగించారు అని అడిగినా కూడా సమాధానం చెప్పడానికి ఇష్టపడని అధికారులు ఎవరి కోసం పని చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. స్థానిక గుంటుపల్లి ప్రాంతంలో నివసిస్తున్న కొంతమంది నిజమైన పేదవారికి వైయస్ జగన్మోహన్ రెడ్డి పథకం లో ఇళ్ల స్థలాలు వచ్చినా కూడా వాటిని తొలగించి ఉన్నవారికి స్థలాలు ఇచ్చారన్న విషయం పై స్థానికులు ఈ విషయాన్ని గుంటుపల్లి వైఎస్ఆర్సీపీ నాయకుడు పాలడుగు దుర్గాప్రసాద్ దృష్టికి తీసుకు వెళ్ళడంతో వెంటనే నిజమైన అర్హులను వెంట పెట్టుకొని స్థానిక తహశీల్దార్ కార్యాలయం కి వెళ్లగా అక్కడ ఉన్న తహశీల్దార్ సరైన సమాధానం చెప్పక పోవడంతో, ఆ సమస్య స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది . వెంటనే వారి యొక్క సమస్యను విని వెంటనే స్పందించి నిజమైన అర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులకు హెచ్చరించడంతో వారి ఆనందానికి హద్దులు లేవు , ప్రతి పేదవాడి కి అందవలసిన పథకాలను రెవెన్యూ అధికారులు ఉన్న వారికే కట్టబెడుతున్నారని ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు.