జగ్గయ్యపేట (తెలుగుతేజం ప్రతినిధి) : ఫీవర్ సర్వే లో స్పెషల్ ఆఫీసర్లదే పూర్తి బాధ్యత అని కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో ఫీవర్ సర్వే పై రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను తో కలిసి పట్టణ, మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణం, మండలంలో కోవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని అన్నారు. ప్రభుత్వ అధికారులు గ్రామాల్లో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసుకుని ఫీవర్ సర్వే నిర్వహించి పాజిటివ్ రేట్ ను తగ్గించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ యువనాయకులు సామినేని వెంకట కృష్ణప్రసాద్, మున్సిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్, తహశీల్దార్ రామకృష్ణ, ఎంపిడిఓ జయచంద్ర గాంధీ, ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.