కృష్ణా జిల్లా (గన్నవరం ప్రతినిధి): తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గ ఇన్ చార్జి, శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు జన్మదినోత్సవ వేడుకలు గన్నవరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగాయి. గన్నవరం ఇన్ చార్జిగా నియమితులైన తర్వాత తొలిసారిగా ఆయన పుట్టినరోజు వేడుకలు గన్నవరంలో పార్టీ శ్రేణుల మధ్యలో నిర్వహించుకున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యాలయానికి తరలివచ్చారు. తొలుత ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుతో నాయకులు కేకు కట్ చేయించారు. అనంతరం గజమాలతో ఆయనను సత్కరించారు.ఈ సందర్భంగా అర్జునుడు మాట్లాడుతూ. టీడీపీకి కార్యకర్తలే కొండంత బలమన్నారు. పార్టీలోకి అనేక మంది నాయకులు వచ్చి, వెళుతున్నా కేడర్ మాత్రం చెక్కు చెదరలేదని తెలిపారు. పార్టీలో అంకిత భావంతో పని చేసేవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని చెప్పారు. గతేడాది తాను కరోనా బారిన పడ్డానని, అప్పుడు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధతో తనకు వైద్యం చేయించడంతో అందరి మధ్య జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పుట్టినరోజు శభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం తెలుగు మహిళ రాష్ట్ర నాయకురాలు మూల్పూరి సాయి కల్యాణి సహకారంతో పారిశుధ్య కార్మికులకు బియ్యం, నిత్యావసరాలను ఎమ్మెల్సీ పంపిణీ చేశారు.అర్జునుడు పుట్టినరోజు వేడుకలలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా, సాగునీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, టీడీపీ గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ కోనేరు నాగేంద్ర కుమార్ (నాని), గన్నవరం మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి బోడపాటి రవి, గన్నవరం టౌన్ అధ్యక్షుడు జాస్తి శ్రీధర్, ఉంగుటూరు మండల అధ్యక్షుడు డాక్టర్ ఆరుమళ్ల కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆళ్ళ హనూఖ్, విజయవాడ రూరల్ మండల అధ్యక్షుడు గొడ్డళ్ల చిన రామారావు, కార్యదర్శి గరిమెళ్ల నరేంద్ర చౌదరి, సీనియర్ నాయకులు జూపల్లి సురేష్, చెన్నుబోయిన శివయ్య, దండు సుబ్రహ్మణ్యం రాజు, మొవ్వా వెంకటేశ్వర రావు, బొడ్డపాటి రాంబాబు, తెలుగు మహిళ మచిలీపట్నం పార్లమెంటు అధికార ప్రతినిధి వడ్డిలి లక్ష్మి, గన్నవరం నియజకవర్గం అధ్యక్షురాలు రమాదేవి, ఉంగుటూరు మండల అధ్యక్షురాలు మండవ రమ్యకృష్ణ తదితరులు పాల్గొన్నారు.