మోపిదేవి (తెలుగు తేజం ప్రతినిధి): కృష్ణాజిల్లా మోపిదేవి మండల పరిధిలో మోపిదేవి వార్పు వద్ద దివిసీమ కు చెందిన అవనిగడ్డ. కోడూరు. నాగాయలంక మండలాలకు సాగునీటిని ఆదివారం అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు విడుదల చేశారు. పూలు .పళ్ళు. పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దివిసీమ ప్రజలకు సాగునీటి . త్రాగు నీటి అవసరాలు తీరే విధంగా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. దివిసీమ కు చెందిన 70 వేల ఎకరాలకు. చల్లపల్లి మోపిదేవి ఘంటసాల మండలాలకు చెందిన లక్షా 90 ఎకరాలకు సాగు నీటిని ఈరోజు నుంచి వినియోగించు కోవచ్చు నని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ప్రక్కనే ఉన్న కాటన్ దొర విగ్రహానికి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు. నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ రవి కిరణ్. అసిస్టెంట్ ఇంజనీర్లు యు వెంకటేశ్వరరావు. కె శ్రీరామ జనార్ధనరావు. రామ్ కుమార్. కిషోర్ .అవనిగడ్డ వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రేపల్లె శ్రీనివాసరావు. మోపిదేవి. కోసూరు వారి పాలెం పిఎసిఎస్ అధ్యక్షులు కామిశెట్టి సురేష్ బాబు. కోసూరు కోటేశ్వర రావు. పార్టీ నాయకులు లింగం జగదీష్ కుమార్. మోర్ల శ్రీనివాసరావు. గండు దుర్గారావు. అరజా వెంకట సుబ్బారావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.