ముస్తాబాద గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బంది డ్రైనేజీ కోసం కాలవ తవ్వి పది రోజులు అవుతున్న ఇంతవరకు పూడ్చ లేదు, గ్రామపంచాయతీ సిబ్బంది వర్షాకాలంలో డ్రైనేజీ కాలువలు తీసి గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది
రాత్రి అయితే దోమల బాధ మురుగు నీటి పారుదల సౌకర్యం మృగం కావటంతో ఎక్కడ మురుగు అక్కడే స్తంభించి పోతుంది ఈ నేపథ్యంలో మురుగునీరు రోడ్ల పైకి చేరి గ్రామా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది పాల కేంద్రం ఎదురు రోడ్ లో ఈ పరిస్థితి అధికంగా ఉంది గ్రామపంచాయతీ వారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు కరోనా మహమ్మారి
విలయ తాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో గ్రామపంచాయతీ వారు పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆరోగ్య శాఖ వారు గ్రామం పరిశుభ్రంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్న పట్టించుకోని గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు అధికారులు వర్షం వచ్చి రోడ్లు నీటితో నిండి ఉండటంతో మరియు కాలువల పొంగడం తో దోమలు అధికంగా వ్యాప్తి చెందుతున్నాయని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నిసార్లు ఈవోకు చెప్పినా పట్టించుకోలేదని ప్రజలు వాపోతున్నారు….