బాపులపాడు తెలుగు తేజం ప్రతినిధి. పాఠశాల, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు లయన్స్ క్లబ్ సంపూర్ణ సహకారం అందిస్తుందని లయన్స్ మాజీ గవర్నర్ వీరమాచినేని రామబ్రహ్మం అన్నారు. ఓగిరాల ఎంపీపీ స్కూల్స్ విద్యార్థులకు మేడికొండ బుచ్చిబాపయ్య భార్య జయప్రద జ్ఞాపకార్థం వితరణ చేసిన 30వేల విలువైన పుస్తకాలు తదిత సామాగ్రిని శుక్రవారం అందజేశారు. తన స్వగ్రామంలో చదువుకునే విద్యార్థులకు ఎటువంటి సాయం కావాలన్నా తన వంతు సహకారంగా అందజేస్తానని, తన తదనంతరం కూడా విద్యాభివృద్ధి సహకారం అందేలా ఏర్పాటు చేశానని సీనియర్ లయన్స్ నాయకుడు బుచ్చిబాపయ్య తెలిపారు. సేవా తత్పరులైన లయన్స్ నాయకులు అందించిన సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ చదువుల్లో రాణించాలని సర్పంచ్ కగ్గా పద్మావతి విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా కార్యవర్గ సభ్యులు గూడపాటి రత్నశేఖర్, నందిగం స్వామి, అక్కినేని శ్రీనివాస్ పణీంద్ర , కార్యదర్శి మాకినేని శ్రీనివాసరావు ,కోశాధికారి శివరామకృష్ణ ,ఎంపీటీసీ సభ్యుడు టి సుబ్బారావు, విద్యా కమిటీ చైర్మన్ వాసు , సత్యవతి ,సత్తెనపల్లి వెంకటేశ్వరరావు,కగ్గా డేవిడ్, ప్రధానోపాధ్యాయులు పద్మజాకుమారి, ఆశాలత ఉపాధ్యాయులు మణికుమారి భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు