జి.కొండూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో వైఎస్సార్ చేయూత పథకం కింద జి.కొండూరు మండలంలోని 3,684 మంది లబ్ధిదారులకు రూ.6,90,93,750లను ఆయన బుధవారం విడుదల చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ వైయస్సార్ చేయూత పథకం కింద ప్రభుత్వం ఇచ్చే సొమ్మును మహిళలు సుస్థిర జీవనోపాధి కోసం వినియోగించుకోవాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. వైఎస్సార్ చేయూత ద్వారా ఉపాధి మార్గాలు, జీవనోపాధితో విజయం సాధించిన మహిళల ద్వారా ఇతర మహిళలు స్ఫూర్తి పొందాలన్నారు. గత ప్రభుత్వం అమలు కానీ సుమారు 650 బూటకపు హామీలు ఇచ్చి మోసం చేసిందన్నారు. గత ప్రభుత్వం మహిళలను ఆదుకోకపోవడం వల్ల మొత్తం వ్యవస్థే చిన్నాభిన్నం అయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.