తిరువూరు నుండి మచిలీపట్నం కు వెళ్లే తెల్లవారుజామున గం.5.30 ఎక్స్ ప్రెస్ బస్ సర్వీస్ ను ఆర్టీసీ అధికారులు 10రోజుల క్రితం రద్దు చేయటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీర్ఘ కాలంగా ప్రయాణీకుల అవసరాలకు ఎంతో ఉపయోగకరం గా వున్న ఈ ఉదయం బస్ సర్వీస్ ను రద్దు చేయటం పట్ల ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రం గా వున్న మచిలీపట్నం, ఆ మార్గం లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, జిల్లా కోర్టు కు వెళ్లే కక్షిదారులు, గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్, అంగలూరు డి ఎస్ సి కోచింగ్ సెంటర్కు వెళ్లే విద్యార్థులతో పాటు వివిధ పనుల నిమిత్తం ప్రతినిత్యం వందలాది మంది పట్టణ, మండల,పరిసర ప్రాంతాలనుండి ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ఉదయాన్నే మచిలీపట్నం రూట్ లోని నూజివీడు, హనుమాన్ జంక్షన్, గుడ్లవల్లేరు, గుడివాడ, మార్గం లో వెళ్లే ప్రయాణీకులకు సమయానుకూలంగా, సౌకర్యం గా వున్న మచిలీపట్నం (బందరు) కు ఉదయం గం 5.30 బస్ సర్వీస్ ను వెంటనే పునరుద్దరించాలని ప్రయాణీకులు , ప్రజా సంఘాలు కోరుతున్నారు.ఇదే విషయమై డిపో మేనేజర్ ను వివరణ కోరగా హైర్ బస్ కాంట్రాక్టు ముగిసినందున ఆ బస్ రూట్ బస్ ను రద్దు చేయటం జరిగిందని ప్రయాణీకుల అవసరాల మేరకు బస్ లు అందుబాటులో లేకపోవటం ఈ పరిస్థితికి కారణం అని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రక్షణనిధి ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కు కృషి చేయాలని ప్రయాణీకులు ముక్త కంఠం తో కోరుతున్నారు.