ప్రత్యేక పూజలు నిర్వహించిన మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు
నూజివీడు: నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలోని శ్రీ కోదండ రామాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు మాట్లాడుతూ అక్రమ అరెస్టు చేసిన టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, త్వరలో ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టాలని కోరుకుంటూ పూజలు నిర్వహించినట్లు తెలిపారు.