చందర్లపాడు : ప్రజారోగ్యానికి ప్రభుత్వం భద్రత.. పేదలకు వరం అని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు అన్నారు. మండల కేంద్రమైన చందర్లపాడు లో1 ఏర్పాటుచేసిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ శిశు సంక్షేమ శాఖ (అంగన్వాడి )లు ఏర్పాటు చేసినటువంటి పలు రకాల పోషక విలువలతో కూడినటువంటి ఆహార పదార్థాలను స్టాల్స్ గా ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో నూతన సంక్షేమ పథకాలకు నాంది పలుకుతూ విద్యా ఆరోగ్యానికి పెద్ద పీట వేసింది అని ఆరోగ్యంతో పాటు సమానంగా విద్య కూడా ప్రాధాన్యత కల్పిస్తూ అంగనవాడిలో గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు సంపూర్ణ పోషణ అందాలనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంతో పిల్లలకు అందజేస్తున్నటువంటి సంపూర్ణ పోషక విలువల ఆహార పదార్థాలను మెనూ ప్రకారం అధికారులకు వివరించారు. గర్భవతులకు బాలింతలకు పిల్లలకు ప్రభుత్వం నుండి అందుతున్నటువంటి పోషకాలు వాటి విలువలు అనే అంశాలపై వివరించారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు మొక్కపాటి నరసింహారావు సర్పంచ్ కష్టాల పున్నమ్మ ఎంపీటీసీ సభ్యులు అంగన్వాడి సూపర్వైజర్ శ్రీలత పలువురు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు