న్యూఢిల్లీ : నిషేధిత రసాయనాలతో తయారైన పటాకులను కాల్చడాన్ని నిషేధిస్తూ తామిచ్చిన ఉత్తర్వులు ఢిల్లీకి మాత్రమే కాదు దేశమంతా వర్తిస్తాయని సుప్రీంకోర్టు తాజాగా పేర్కొన్నది. అత్యున్నత న్యాయస్థానం ఇంతక్రితం జారీ చేసిన ఉత్తర్వులు రాజస్థాన్ సహా దేశంలోని అన్ని రాష్ర్టాలు అమలుజేయాలని స్పష్టం చేసింది. ‘వాయు, ధ్వని కాలుష్యాన్ని నియంత్రించే బాధ్యత అందరిదీ. పర్యావరణ పరిరక్షణ అన్నది కేవలం కోర్టుల బాధ్యత కాదు’ అని జస్టిస్ సుందరేశ్ అన్నారు.