అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు జర్నలిస్టు సంఘం నాయకులు, సీనియర్ జర్నలిస్టులు.. ఇటీవల జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నందకు క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ యూనియన్ నేతలు జి ఆంజనేయలు, ఎస్.వెంకటరావు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి వి ఆర్ కృష్ణంరాజు, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రతినిధి విజయ్ భాస్కర్ సహా పలువురు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. కాగా, జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే.. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అక్రిడేటెడ్ జర్నలిస్టులకు మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలనే ప్రతిపాదనకు ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఆమోద ముద్ర వేసింది.. దీంతో.. ఎంతో కాలంగా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తోన్న జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్. దీంతో.. సీఎం వైఎస్ జగన్ తో ప్రత్యేకంగా సమావేశమైన ధన్యవాదాలు తెలిపారు జర్నలిస్టు సంఘం నేతలు, సీనియర్ జర్నలిస్టులు.