అతిరధ మహారధులకు స్వాగతం చెబుతూ పోటెత్తిన జనం
ముఖ్యనేతలకు అడుగడుగునా ఆదరణ
కిక్కిరిసిన రోడ్డు మార్గం – జన వాహినితో నిండి పోయిన పామర్రు టౌన్ బహిరంగ సభా ప్రాంగణం
సామాజిక సాధికార యాత్రను అత్యంత ఘనంగా విజయవంతం చేసినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ముఖ్య నేతలు
పామర్రు : పామర్రు నియోజకవర్గంలో గురువారం జరిగిన సామాజిక సాధికార యాత్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలలలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల ఉన్న గౌరవాన్ని, ఆయన చేపట్టిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల వారికి కలిగిన మేలును చాటి చెప్పింది. రాష్ట్ర వైసీపీ నాయకత్వం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అంతటా విజయవంతంగా జరుగుతున్న సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఈరోజు బస్సు యాత్ర పామర్రు నియోజకవర్గంలోని భారీ ర్యాలీగా కొనసాగి, అనంతరం అక్కడ అశేష జన వాహిని మధ్య బహిరంగ సభ జరిగింది. యాత్రలో పాల్గొనడానికి వచ్చిన అతిరధ మహారధులకు పోటెత్తిన పామర్రు ప్రజలు, అడుగడుగునా స్వాగతం పలుకుతూ తమ ఆదరణ తెలియజేసారు. వైసీపీ జండాలు కట్టిన కొన్ని వేల బైకులు, వందలాది కార్లు, ట్రాక్టర్ల మీద జనం బస్సు యాత్రను ప్రభంజనంలాగా అనుసరిస్తూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు మేరుగ నాగార్జున , జోగి రమేష్ , బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ,రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, MLC మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి ,సింహాద్రి రమేష్ లతో కలిసి పాల్గొన్న కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, పామర్రు నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.