- 14 నుంచి 20 వ తేదీ వరకు ఉత్సవాలు
- వారం రోజులపాటు కార్యక్రమాలు
తిరువూరు : తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేటి నుంచి 56వ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సుశీలరావు,లైబ్రేరియన్ డాక్టర్ కే.కుసుమ తెలిపారు. ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కళాశాలలో ఈ వారోత్సవాలు జరుపుతున్నట్లు వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు కాలేజీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 14వ తేదీ ఉదయం కళాశాలలో గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమవుతాయని వివరించారు. 15వ తేదీన లైబ్రరీ హాల్లో ‘పాలన సంస్కరణల్లో గ్రామ సచివాలయాల పాత్ర’ పై వ్యాసరచన పోటీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 16వ తేదీన ‘పుస్తక పఠనంలో వచ్చిన ఆధునిక పోకడలు’ వివరిస్తూ వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 17వ తేదీన కళాశాలలో పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 18 వ తేదీన ఈ రిసోర్సెస్ పై అవగాహన సదస్సును నిర్వహిస్తున్నామని వారు వివరించారు. 20వ తేదీన ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమం తో పాటు గ్రంథాలయ ఉద్యమం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగిందని వివరించారు. ప్రతి మనిషిలోనూ పుస్తక పఠనంపై అవగాహన పెంచడం లక్ష్యంగా గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు.