తెలుగు తేజం, వత్సవాయి : తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని రవాణా చేస్తున్న కానిస్టేబుల్నివత్సవాయి ఎస్ఐ సోమేశ్వర రావు భీమవరం టోల్గేట్ వద్ద పట్టుకున్నారు. కృష్ణా జిల్లా వత్సవాయి పోలీసుస్టేషన్ లో సోమవారం డీఎస్పీ రమణమూర్తి సిఐ చంద్రశేఖర్ వెల్లడించిన వివరాలమేరకు అక్రమ మద్యం తరలిస్తున్నారన్న సమాచారం తో వత్సవాయి మండల పరిధిలో గట్టు భీమవరం వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఇండికా కార్ లో చిల్లకల్లు పోలీస్ స్టేషన్ కు చెందిన మద్దిరాల శ్రీను అనే కానిస్టేబుల్ ఏపీ 31 ఏ డబ్ల్యు 0079 నెంబరు గల కారులో రూ. 48, 590/- విలువ గల మొత్తం 244 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు ఈ సందర్భంగా డీఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ తప్పుచేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టే పనిలేదని,అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకుంటామో. అలాంటి చర్యలే కానిస్టేబుల్ మీద తీసుకుంటామని, ఇలాంటి వారి వల్లే సమాజంలో పోలీసు వారి పై నమ్మకాన్ని పోతున్నాయని, ఇటువంటి వారిపై డిపార్ట్మెంట్ పరంగా తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.