తెలుగు తేజం, నందిగామ నందిగామ నియోజకవర్గంలో 32,260 మంది విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో 48 కోట్ల 39 లక్షల రూపాయలు జమ. నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(ZPHS)లో రెండవ ఏడాది అమ్మఒడి పథకాన్ని శాసనసభ్యుడు డా”మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విద్యావ్యవస్థలో అమ్మఒడి ద్వారా విప్లవానికి నాంది పలికారని, పిల్లలను బడికి పంపించే ప్రతి పేదతల్లికి ఏడాదికి రూ.15,000/- లు బ్యాంకు ఖాతాలో జమ చేయడం ద్వారా, నిరుపేద తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటునందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా నాడు- నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి ,కార్పొరేట్ స్కూల్ లను తలదన్నే విధంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యను ప్రభుత్వం అందజేస్తుందని ,దానితోపాటు జగనన్న విద్యా కానుక పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఉచితంగా స్కూల్ బ్యాగ్, యూనిఫామ్, బుక్స్ ,షూ ,టై, బెల్ట్ ఇవ్వటమే కాకుండా మధ్యాహ్న భోజన పథకం గోరుముద్ద ద్వారా రుచికరమైన భోజనాన్ని కూడా ప్రభుత్వమే ఉచితంగా అందిస్తూ పేద పిల్లల భవిష్యత్తు ను ప్రభుత్వం మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతుందన్నారు , ఈ కార్యక్రమంలో మండల అధికారులు ,ఉపాధ్యాయులు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,పేరెంట్స్ కమిటీ సభ్యులు ,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు .