తెలుగు తేజం , విజయవాడ : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ఆదివారం కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవం, మల్లేశ్వరస్వామి ఆలయంలో జ్వాలాతోరణం నిర్వహించనున్నారు. సాయంత్రం పంచహారతుల సేవ అనంతరం 6గంటలకు ప్రధాన ఆలయం ముందున్న మహాగోపురం, మల్లేశ్వరాలయాల ఎదుట, కనకదుర్గానగర్‌లో కోటి దీపాలను వెలిగించేందుకు, జ్వాలాతోరణం నిర్వహించేందుకు దుర్గగుడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాట్టిస్తూ ముఖాలకు మాస్కులు ధరించి పరిమిత సంఖ్యలో భక్తులు ఉత్సవంలో పాల్గొనాలని ఈవో ఎం.వి.సురేష్‌బాబు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం దేవస్థానం అధికారులు, సిబ్బంది, పాలకమండలి సభ్యులతో (పరిమిత సంఖ్యలో) కలిసి గిరిప్రదక్షణ చేయనున్నట్లు ఈవో తెలిపారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమై 8 గంటలకు ముగుస్తుందని వివరించారు.