తెలుగు తేజం,మచిలీపట్నం :వచ్చిన అవకాశాలను వదులుకోవద్దు ఉత్తమ అవకాశాలను అందిపుచ్చుకోవాలని రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేరు పేర్ని వెంకట్రామయ్య (నాని) యువతకు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా పోలీస్ శాఖ మరియు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకుల కోసం శనివారం స్థానిక నోబుల్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించగా అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు బందరు మండలం సుల్తానా నగరంలో రామ రాజు కళ్యాణ మండపము నందు నిర్వహించిన ప్రతిభ జాబ్ మేళా ద్వారా వివిధ కంపెనీలలో అర్హత పొందిన అభ్యర్థులకు మంత్రి పేర్ని నాని జిల్లా కలెక్టర్ ఏ ఎన్ డి ఇంతియాజ్, జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉద్యోగాలు పొందిన వారిని అభినందించారు. మంత్రి పేర్ని నాని మాట్లడుతూ ఉద్యోగాలు రాని వారు నిరుత్సాహ పడవద్దని అన్ని అవకాశాలు వెతుక్కోవడం ఆప వద్దని ఉద్యోగం చిన్నదే కదాని మానేయద్దు అని హితవు పలికారు. తెలివితేటలు ఉద్యోగాలను చేపట్టడంలో మగవారికి తీసి పోని విధంగా ఆడపిల్లలు ఉండడం మంత్రి వారిని అభినందించారు. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ పోలీస్ శాఖ స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన జాబ్ మేళా నిరుద్యోగ యువతకు ఎంతో ప్రోత్సాహం గా ఉందని ఉద్యోగార్థుల ను కలెక్టర్ అభినందించారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ గ్రామీణ యువత లక్ష్యంగా జాబ్ మేల అందరి ఆశీస్సులతో విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈరోజు 36 కంపెనీలో జాబ్ మేళా లో పాల్గొనగా సుమారు 500 మంది ఉద్యోగాలు పొందారని మరో 750 మంది రెండో దశకు అర్హత సాధించారని వీరికి కూడా ఇంటర్వ్యూలు నిర్వహించాక మరి కొంత మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ ఎస్ ఎస్ కె కాజావలి, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి మహా నాయక్, ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్పీ వకుల్ జిందాల్, ఏ ఆర్ ఎస్ పి సత్యనారాయణ పోలీసులు అధికారులు, సచ్చివాలయ సిబంది పాల్గొన్నారు