Breaking News

ఏపీలో పంచాయతీ ఎన్నికల రీ షెడ్యూల్!

తెలుగు తేజం, అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్‌ స్వల్పంగా మారింది. పంచాయతీ ఎన్నికలు వద్దంటూ ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో తొలి విడత ఎన్నికల ప్రక్రియకు ఆలస్యం అయింది. దీంతో మొదటి విడత ఎన్నికలను నాలుగో విడతగా మార్చి అందుకు కొత్త తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 21న నాలుగో విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఇక రెండు, మూడు, నాలుగు విడతల ఎన్నికలను ఒకటి, రెండు, మూడు విడతలుగా మార్చి వాటిని యథాతథంగా జరపనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. మారిన షెడ్యూల్ ప్రకారం తొలి విడత ఎన్నికలు ఫిబ్రవరి 7న, రెండో విడత ఫిబ్రవరి 13న, మూడో విడత ఫిబ్రవరి 17, నాలుగో విడత ఫిబ్రవరి 21న జరగనున్నాయి.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *