తెలుగు తేజం, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ వైరస్ కట్టడికి గుంటూరు కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం, పార్కులు, ఓపెన్ జిమ్‌లు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19వ తేదీ నుంచి వాటిని మూసివేస్తున్నట్లుగా కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు.
గత కొన్ని రోజులుగా సెకండ్ వేవ్‌లో గుంటూరు జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 7,224 కేసులు నమోదు కాగా.. వాటిలో 903 కేసులు ఒక్క గుంటూరు జిల్లాలోనే నిర్ధారణ అయ్యాయి.. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 85,766 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా..690 మంది బాధితులు కొవిడ్‌తో మృతి చెందారు. ప్రస్తుతం 4,301 యాక్టివ్ కేసులున్నాయి.