పేదలకు చేరాల్సినటువంటి బియ్యం పక్కదారి పడుతున్న చూసిచూడనట్లు వ్యవహారం చేస్తున్న రెవెన్యూ అధికారులు
తెలుగు తేజం, నందిగామ : కృష్ణాజిల్లా నందిగామ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెలలో రెండు సార్లు రేషన్ బియ్యం పంపిణీ చేయడంతో ఆ బియ్యం పక్క దారి పడుతోంది. మండలంలోని ఐతవరం జాతీయ రహదారిపై సీఐ కనకారావు వాహనాల తనిఖీలో భాగంగా ఒక రేషన్ షాప్ నుండి బియ్యం అక్రమ రవాణా చేసుకొని లోడుతో వెళ్తున్న లారీని తనిఖీలు నిర్వహించిన పోలీసులు దానిలో సుమారు 13 టన్నులు రేషన్ బియ్యం ఉన్నట్లుగా గుర్తించి రేషన్ డీలర్ల తో పాటు లారీ డ్రైవర్ ని మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ దాడులలో ఎస్ఐ తాతాచార్యులు సిబ్బంది పాల్గొన్నారు.