శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ కి వినతి పత్రం అందచేసిన విజయవాడ పార్లమెంట్ రూరల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బొర్రా కిరణ్
తెలుగు తేజం, కొండపల్లి : కొండపల్లి మునిసిపాలిటీ లో ప్రధాన రహదారులు ను ఇరు వైపులా వెడల్పు చేయటం మరియు అభివృద్ధి పరుచుట గురించి స్థానిక శాసన సభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ తో విజయవాడ పార్లమెంట్ రూరల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బొర్రా కిరణ్ కలసి వినతి పత్రం ఇచ్చి చర్చించటం జరిగింది. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు బొర్రా కిరణ్ మాట్లాడుతూ ముఖ్యంగా కొండపల్లి మునిసిపాలిటీ లో చేయాలిసిన అభివృద్హిపనులు గురించి ఎమ్మెల్యేతో మాట్లాడటం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి మీరు చెప్పిన ఈ పనులన్నీ కొన్ని ఇప్పటికే ఆచరణలోకి వచ్చాయి అని,మిగతా పనులన్నీ వెంటనే చేయ టానికి సిద్ధంగా వున్నాము అని చెప్పటం జరిగింది. కొండపల్లి లో “బి కాలనీ నుండి ఎర్ర బ్రిడ్జ్ దగ్గర నేషనల్ హై వే” వరకు పక్కా డ్రైన్స్ తో పాటు ఇరు వైపులా ఇరుకుగా వున్న రోడ్డు ను వెడల్పు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలనీ కోరారు . ”కొండపల్లి & ఇబ్రహీంపట్నం” గ్రామాల లో వున్న పక్కా డ్రైన్స్ తో పాటు అన్ని రోడ్స్ అభివృద్ధిచేయాలని చెప్పటం జరిగింది. కొండపల్లి లో బాలికల ఉన్నత పాఠశాల ఆవరణ లో “మహిళలకు ప్రత్యేకం గా జూనియర్ కాలేజీ” ఏర్పాటు చేయాలనీ, ఎంతో పురాతన కాలం నుండి కొండపల్లిలో వున్న పోలీస్ స్టేషన్ ను మండల వ్యవస్థ ఏర్పాటు ఐనా సమయంలో తీసివేయటం జరిగింది అని,తిరిగి మరలా పోలీస్ స్టేషన్ ని ఏర్పాటు చేసి ఇక్కడ లా & ఆర్డర్ ప్రాబ్లెమ్ లేకుండా చూడాలనీ అన్నారు. కొండపల్లి లో ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఇబ్బందుల నుండి ప్రజలను రక్షించాలని కోరారు . ఎప్పటి నుండో పెండింగులో వున్న “ఆర్ టి సి బస్ స్టాండ్” ను వెంటనే ప్రారంబించాలని, కొండపల్లి ని టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయా లనీ, అలాగే “గజరాజు చెరువును సుందరీకరణ “చేసి పార్క్ గా మరియు “బోటు షికారు” “వాకింగ్ ట్రాక్” లను ఏర్పాటు పై ఆలోచన చేయాలనీ, కొండపల్లి సాయిబాబా మందిరం దగ్గర నుండి ఖిల్లాకు పోవు రహదారిని వెడల్పు చేయాలని , అలాగే ఖిల్లా కోటపై కొండపల్లి నుండి వెళ్ళాడానికి మెట్ల దారితో పాటు ఉన్న పాత రహదారిని అభివృద్ధి పరచాలని, కొండపల్లి మున్సిపాలిటీ లో ఉన్న కొండపల్లి & ఇబ్రహీంపట్నంలలో ఉన్న ప్రతి ఇంటికి నీటి కుళాయి లను (పంపు) త్వరగా ఏర్పాటు చేయాలని కోరుచున్నాము.
పైన ఉదహరించిన కొండపల్లి మున్సిపాలిటిలో ఉన్న ప్రధాన సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించగలరని కొండపల్లి గ్రామ ప్రజలు తరుపున మరియు కాంగ్రెస్ పార్టీ ద్వారా కోరుచున్నాము.
ఈ కార్యక్రమం లో పీసీసీ కార్యదరిశి పోతురాజు ఏసుదాస్,అక్కల ప్రసాద్, జిలాని,చెరుకు ఆనందరావు, అబ్దుల్ కలామ్ ,స్వర్గం కోటేశ్వరరావు మరియు పి . థామస్ పాల్ తదితరులు పాల్గొన్నారు.