తెలుగు తేజం, నందిగామ : డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని మోటారు వాహన తనిఖీ అధికారి శ్రీమతి ఆయుష ఉస్మాని అన్నారు. స్థానిక నందిగామ బైపాస్ రోడ్డులో గల ఆర్టీవో కార్యాలయంలో వాహన సోదరులతో యజమానులతో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుష ఉస్మాని మాట్లాడుతూ టూవీలర్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ తప్పక ధరించాలని. అధిక స్పీడ్ తో వాహనాలు నడపవద్దని ఆమె కోరారు. రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం రాజుబాబు మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలపై మొదటినుండే అవగాహన పెంపొందించుకోవాలని, అప్పుడే రోడ్డు ప్రమాదాలను అరికట్టగలమని ఆయన అన్నారు. హెల్మెట్ ధరించపోవడం అధిక స్పీడ్ తో వాహనాలు నడపడం వలన ఎక్కువ ప్రమాదాలకు ద్విచక్రవాహనదారులు గురవుతున్నాయని ఆయన తెలిపారు. వాహనాలను అధిక వేగంతో నడపడం వలన అత్యవసర సమయాలలో వాహనాన్ని నియంత్రించడం కష్టమవుతుందని అటువంటి సమయాలలో ప్రమాదాలకు గుర్తెయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు. ఈ సమావేశంలో కార్యాలయ పరిపాలనాధికారి వి శ్రీనివాసచార్యులు, కార్యాలయ ఉద్యోగులు ఎస్ పవన్ కుమార్,శ్రీమతి వీవీఎస్ కమల చౌదరి, సునీల్ నాయక్ ఉన్నారు.