తెలుగు తేజం, విజయవాడ : విజయవాడ డోర్నకల్ రోడ్ ఫ్యామిలీ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు గర్భిణీ బిడ్డను కోల్పోయింది. సకాలంలో సరైన వైద్యం అందించక బిడ్డప్రాణాలు తీసారంటూ ఆసుపత్రి వద్ద కుటుంభ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంభ సభ్యుల డిమాండ్ చేసారు.