తెలుగుతేజం, నందిగామ : స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు సోమవారం నాడు నూతన సంవత్సర తెలుగుతేజం క్యాలెండర్ ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించి వాటి పరిష్కారం కొరకు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారము కొరకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న తెలుగు తేజం దినపత్రికను ఆవిష్కరించటం చాలా సంతోషం దాయకం గా ఉందని, ఎన్నో పత్రికలు ఉన్నా తెలుగుతేజం దినపత్రికకు ప్రజలలో ప్రత్యేక స్థానం ఉందని, ఇలాంటి పత్రిక లో చాలా అరుదు గా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఈ కార్యక్రమంలో నందిగామ మండల వైసీపీ నాయకుడు మరియు తెలుగు తేజం పశ్చిమ కృష్ణ ఇంచార్జి రాంబాబు చందర్లపాడు తెలుగు తేజం విలేఖరి శ్రీనివాస్ కంచికచర్ల తెలుగుతేజం విలేకరి విజయ్ భవాని పాల్గొన్నారు..