గుంటూరు: గుంటూరు జిల్లా నడికుడి ఎస్బీఐలో రూ.85లక్షల సొమ్ము చోరీ జరిగింది. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు 4 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. ప్రాథమిక సమాచారంతో పాటు చోరీ జరిగిన తీరును పరిశీలిస్తే ఆరితేరిన వారే దొంగతనానికి పాల్పడ్డట్లు అనుమానిస్తున్నట్లు చెప్పారు. అతి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అన్నారు. లాకర్‌ను పగులగొట్టి దొంగలు సొమ్ము ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. నిందితులు అన్నిరకాల రెక్కీ చేసి పక్కా ప్రణాళికతో చోరీ చేసినట్లు ఆయన వివరించారు. లోపలి నుంచి సీసీ కెమెరాల కనెక్షన్‌ను కూడా తొలగించినట్లు చెప్పారు. పోలీసు జాగిలాలు వస్తాయనే అనుమానంతో దొంగలు కారం చల్లినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు.