తెలుగు తేజం , విజయవాడ : రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా రోడ్డు నిబంధనలను అతిక్రమించిన వాహనదారుపై కేసులు నమోదు చేసేందుకు మంగళవారం బందరు రోడ్డు లోని రవాణాశాఖ కార్యాలయ సమీపంలో ప్రత్యేక తనిఖీలను నిర్వహించారు. తనిఖీలు నిర్వహిస్తూడగా పలుపురు ఆర్టీఏ కార్యాలయం చెందిన సిబ్బంది హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నాడుపడం గుర్తించి
వారిపై కేసులను నమోదు చేసిన్నట్లు డిటిని తెలిపారు. నిబంధనలు పాటించకుంటే ఉద్యోగులైన ఉపేక్షించేది లేదని ట్రాఫిక్ నిబంధనలు ప్రతిఒక్కరు పాటించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుటామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పని సరిగా ధరించాలని హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే వెయ్యి రూపాయిల జరిమానతోపాటు డ్రైవింగ్ లైసెన్సు ను కూడా 3 నెలలు సస్పెండ్ చెయ్యడం జరుగుతుందన్నారు. హెల్మెట్ దరించని 30 మంది వాహన సోదకులపై కేసులు నమోదు చేశామన్నారు. వీళల్లో ఎనిమిది మంది ఆర్టీఏ ఉద్యోగులున్నారన్నారు. అనంతరం కేసులు నమోదైన వాహనచోదకులకు రోడ్డు ప్రమాదాలు జరగటానికి గల కారణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహనను కల్పించమన్నారు. జరుగుతున్న ద్విచక్ర వాహన రోడ్డుప్రమాదాలలో ఎక్కువశాతం మరణించాడని ప్రధాన కారణం హెల్మెట్ ధరించపోవడమేనని అన్నారు. హెల్మెట్ ధరించడం వలన ప్రమాద జరిగినప్పుడు ప్రమాద తీవ్రత స్థాయి తగ్గుతుందని తద్వారా మనిషి బ్రతికే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటించే దానిలో ప్రభుత్వ ఉద్యోగులుగా ముందుండి ప్రజలకు ఆదర్శంగా నిలవలన్నారు. ప్రభుత్వశాఖలో పనిచేసే అధికారులు ఉద్యోగుల సైతం హెల్మెట్ సీటుబెల్ట్ ధరించే వాహనాలు నడపాలని అని సూచించారు. రోడ్డు నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపితే నూతన మోటార్ వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలలో వాహన తనిఖీ అధికారులు డి ఎస్ ఎస్ నాయక్, మహమ్మద్ అలీ, రాధిక దేవి ఉన్నారు.