Breaking News

పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా.మొండితోక.జగన్ మోహన్ రావు

తెలుగు తేజం, నందిగామ : నందిగామ పట్టణం 19 వ వార్డు హనుమంతుపాలెంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ.6 లక్షల నిధుల అంచనా విలువతో నూతనంగా నిర్మించనున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డా.మొండితోక.జగన్ మోహన్ రావు మంగళవారం అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని, నాడు- నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చటమే కాకుండా ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు ,ఉపాధ్యాయులు ,వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *