కొమ్రంభీం: జిల్లాలోని పెంచికల్ పేట మండలం కొండపల్లి పరిసర గ్రామాల్లో ఆందోళన నెలకొంది. నిన్న పులి దాడిలో వ్యవసాయ కూలీ నిర్మల మృతి చెందింది. రాత్రి మృతదేహాన్ని తీసుకెళ్తుండగా అంబులెన్స్‌కు పులి ఎదురైంది. దీంతో పులి అలజడితో పొలాలకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. పులిని బంధించి ప్రాణాలు కాపాడాలని గ్రామస్తుల వేడుకుంటున్నారు. మరోవైపు పులి దాడిలో మృతి చెందిన నిర్మల కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థికసాయంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే పులిదాడి చేసిన ప్రాంతంలో కెమెరాలతో పాటు బోనుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.