వీరులపాడు మండల గ్రామాలలో సంక్రాంతి పండగను పురస్కరించుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన, శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వీరులపాడు ఎస్ ఐ మణికుమార్ తెలిపారు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్, నందిగామ డిఎస్పీ ఈ నాగేశ్వర్ రెడ్డి, నందిగామ రూరల్ సీఐ సతీష్ కుమార్ ఆ దేశాల మేరకు మండలంలోని ఆయా గ్రామాల్లో ఆటోల ద్వారా ప్రచారం చేపడుతూ ప్రజానీకానికి అవగాహన కల్పిస్తున్నారు పేకాట, కోడి పందాలు, గుండాట అశ్లీల ప్రదర్శనలు నిర్వహిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కోవిడ్ నెలకొన్న పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకొని మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు సంక్రాంతి పండగ పురస్కరించుకొని ప్రజలంతా కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని అన్నారు