ఢిల్లీ : దేశంలో చట్ట సభల్లో సభ్యులపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులను తొందరగా పరిష్కరించే బాధ్యతను హైకోర్టులకు అప్పగిస్తూ ధర్మాసనం ఉత్వర్వులు ఇచ్చింది. దీని కోసం ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. మరో 6 నెలల్లో లోక్‌సభ ఎన్నికల వస్తుండటంతో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నేతలపై దాఖలైన కేసుల విచారణకు మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజా ప్రతినిధులపై దాఖలైన క్రిమినల్ కేసులను త్వరిత గతిన విచారించాలని హైకోర్టులకు తెలిపారు. తీవ్రమైన నేరం విషయంలో ట్రయల్ కోర్టు విచారణను వాయిదా వేయకూడదని సుప్రీం ధర్మాసనం సూచించింది. కేసుల సత్వర పరిష్కారానికి వెబ్ సైట్ ను రెడీ చేయాలని చెప్పుకొచ్చింది. దోషిగా తేలిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధంపై ఇంకా విచారణ జరుతామని వెల్లడించారు. అవసరమైతే సుమోటో కేసులు నమోదు చేసి ప్రత్యేక బెంచ్‌లతో త్వరిత గతిన విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు తెలిపింది. దీని కోసం అన్ని హైకోర్టులకు ముఖ్యంగా కేసు నడిచే ట్రయల్ కోర్టులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడం కష్టమని సీజేఐ సూచించారు.