తెలుగు తేజం, గుడివాడ : రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై దాడి నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో మంత్రుల నివాసం, కార్యాలయాల్లో అదనపు భద్రతా చర్యలు చేపట్టారు. గుడివాడలోని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నివాసంలో మెటల్ డిక్టర్, డిజిటల్ స్కానర్ల ఏర్పాటు చేశారు. మంత్రి కొడాలి నాని నివాసాన్ని డాగ్ స్క్వాడ్‌తో అణువణువునా తనిఖీలు చేస్తున్నారు. మంత్రి నివాసాన్ని భద్రత సిబ్బంది అధీనంలోకి తీసుకుంది. సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే మంత్రి నివాసంలోకి అనుమతిస్తున్నారు.