తెలుగు తేజం, మచిలీపట్నం : మత్స్యకారుల అభివృద్ధి పథంలో నడిపేందుకు మత్స్యశాఖలో అనేక రకాల అభివృద్ధి పథకాలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యలు పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గురించి తెలుసుకున్నారు.
తొలుత జిల్లా మత్స్యశాఖ అధికారులు మంత్రి పేర్ని నాని కలుసుకున్నారు కృష్ణా జిల్లాలో 8 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి సాధించి రాష్ట్రంలో మొదటి స్థానం సాధించినట్లు మత్స్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం 2020 పురస్కరించుకుని గత శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పురస్కారానికి మూడు లక్షలతో ఒక జ్ఞాపక బహుమతి లభించిందని సంచాలకులు లాల్ మొహమ్మద్ మంత్రికి తెలిపారు. ఈ విజయానికి సమిష్టి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాము అన్నారు ఇలాగే మున్ముందు సైతం కృష్ణా జిల్లా విద్యాశాఖ రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని మరలా మరలా కైవసం చేసుకోవాలని మంత్రి పేర్ని నాని కోరారు.
కృష్ణాజిల్లాలో 111 కిలోమీటర్ల సముద్రతీరం ఉందని 1,12,977 మంది మత్స్యకారులు జిల్లాలో నివసిస్తున్నారని పేర్కొంటూ 4 తీర ప్రాంత మండలాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. మచిలీపట్నం పరిసర గ్రామాలలో సముద్రంలో చేపల వేట ముగించుకుని తిరిగి వచ్చే సమయంలో దీపాలు కనబడక ఎంతో ఇబ్బంది పడుతున్నారని సముద్రం లైట్లు కనబడడం లేదని పలువురు మత్స్యకారులు తెలిపారు. ఇక్కడ ఎత్తయిన స్తంభాలు నిర్మించి రెండు శక్తివంతమైన విద్యుద్దీపాలను ఏర్పాటు చేసే విషయంలో చురుగ్గా ఏర్పాట్లు చేయాలని మంత్రి పేర్ని అధికారులకు సూచించారు. ఫిషింగ్ హార్బర్ వద్ద దట్టంగా ఎత్తైన చెట్లు పెరిగి పోవడంతో అతిపెద్ద టవర్ నుంచి శక్తివంతమైన ప్రచురించే లైట్లు ఏర్పాటు చేయాలని వీటిని మంజూరు కోసం ఎవరిని సంప్రదించాలి అధికారం అడిగారు. మారిటైమ్ సీఈఓ రామకృష్ణారెడ్డికి మంత్రి పేర్ని నాని ఫోన్ చేసి మత్స్యకారులు ఎదుర్కొంటున్న అవస్థలు తెలిపారు. దీంతో ఆ అధికారి టవర్ నిర్మాణ అంచనాలు, నియాన్ లైట్ల వివరాలు సాంకేతిక అధికారులు పంపితే వెంటనే నిధులు మంజూరు చేస్తానని మంత్రి పేర్ని నాని కి సృష్టమైన హామీ ఇచ్చారు.