నో డ్రగ్ నో క్యాన్సర్ అంటూ రింగ్ సెంటర్లో అవగాహన ర్యాలీ నిర్వహించిన ఇబ్రహీంపట్నం పోలీసులు.
తెలుగు తేజం, ఇబ్రహీంపట్నం : ప్రస్తుతం యువత మాదక ద్రవ్యాలకు బానిసగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వాటి బారిన పడకుండా తమ జీవితాలను కాపాడుకోవాలని, మాదక ద్రవ్యాలు వాడడం వలన రోగాల బారిన పడటం తప్ప వేరే ఉపయోగం లేదని ఇబ్రహీంపట్నం సీఐ శ్రీధర్ కుమార్ తెలిపారు. సోమవారం నాడు ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో డ్రగ్స్ వాడవద్దు ఇబ్రహీంపట్నం పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ ఐ లు శ్రీనివాస్, రమేష్ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.