తెలుగు తేజం, జగ్గయ్యపేట : మానవ వనరుల అభివృద్ధిపైనే ఆ దేశ ప్రగతి ఆధారపడి ఉంటుందని సామాజికవేత్త కర్లపాటి వెంకట శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ట్రస్ట్ కార్యాలయంలో ప్రారంభమైన ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. బాల్యదశలో కలిగించే ప్రేరణ భవిష్యత్తు లో వ్యక్తిత్వ వికాసానికి దోహద పడతాయని అన్నారు. అంగన్వాడి కార్యకర్తలు బాలబాలికల్లో తగు ప్రేరణ ను కలిగించవలసిన ఆవశ్యకత ఉందని ఆయన సూచించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉషారాణి బాలబాలికల్లో ఉన్న సృజనాత్మకత గుర్తించి ఆ మేరకు కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. కాగా ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా సంరక్షణ అధికారులు, మాస్టర్ ట్రైనర్స్ లక్ష్మీకాంతం, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు