తెలుగు తేజం , వత్సవాయి మండలంలోని భీమవరం పరిధిలోగల శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో మార్గ శుద్ధి పంచమి సందర్భంగా స్వామి సూర్యప్రకాష్ ఆలయ ధర్మకర్త వారి కుమారులు శాంతి కళ్యాణం శనివారం దుబ్బాక హరికృష్ణ, దుబ్బాక వెంకటనారాయణ శర్మ దర్శకులతో ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరము మార్గశిర శుద్ధ పంచమి రోజున శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శాంతి కళ్యాణం అంగరంగ వైభోగంగా సన్నాయి మేళం మధ్య వేద మంత్రాలతో ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శనివారం మార్గశిర శుద్ధ పంచమి కావడముతో ఆకుల పుల్లారావు శ్రీనివాస్ రావు దంపతులు పీటల మీద కూర్చొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త స్వామి సూర్య ప్రకాష్ కుటుంబీకులు సుమారు 100 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు అలాగే ఈ స్వామివారికి సుమారు మూడు ఎకరాల పోలము ఉన్నట్లుగా దానిపై వచ్చే ఆదాతో స్వామివారికి దూప దీప నైవేద్యం కొరకు అలాగే దేవాలయం లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఉపయోగిస్తున్నట్లు గా వారు తెలిపారు. ప్రస్తుత తరుణంలో సుమారు 50 సంవత్సరాల నుండి స్వామి సూర్య ప్రకాష్ అధ్యక్షతన ఈ దేవాలయంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తుల మన్ననలు పొందుతున్నారు. అలాగే శనివారం మార్గశిర శుద్ధ పంచమి శాంతి కళ్యాణ మహోత్సవానికి సుమారు 100 మంది భక్తులు పాల్గొన్నారు. వారికి తీర్థప్రసాదాలు అందించడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు స్వామి సావిత్రమ్మ, వెంకటేశ్వర్లు నీ రాజకుమారి, సందీప్, ఆరదీప్, శ్రీనివాస్ రావు, లక్ష్మి, సనత్, వాసవి, శ్రీహరి, ఇందు కుమారి, సాయి ప్రకాష్, అలాగే భీమవరం గ్రామ ప్రజలు మరియు భక్తులు పాల్గొన్నారు.