తెలుగు తేజం, వీరులపాడు : అక్రమ రేషన్ బియ్యం నిల్వలపై పోలీసుల దాడులు నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. వీరులపాడు మండలం జయంతి గ్రామ శివారులో 15 టన్నుల రేషన్ బియ్యం లారీ ని గుర్తించిన టాస్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారం తో దాడులు నిర్వహించి రేషన్ బియ్యం లారీ ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీ మరియు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని వీరులపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ దాడిలో టాస్ ఫోర్స్ ఎస్ఐ మురళీకృష్ణ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణస్వామి వీరులపాడు ఎస్ ఐ హరి ప్రసాద్ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు