తెలుగు తేజం విజయవాడ:ప్రపంచ వ్యాప్తంగా మహిళలు సాధించిన పురోగతి సంకల్ప శక్తి ధైర్యం స్త్రీ మూర్తులకు అదర్శపాయం కావాలని సంయూక్త రవాణా కమీషనర్ ఎల్.ఎస్.యం.రమాశ్రీ అన్నారు.అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకుని సోమవారం స్థానిక ఆర్టిసి ప్రాంగణంలో ఎన్టీఆర్ పరిపాలన భవనంలోని రాష్ట్ర రవాణాశాఖ కార్యాలయంలో రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్-2 అధ్యక్షులు యం. రాజుబాబు ఆధ్వర్యంలో సంయూక్త రవాణా కమీషనర్ ఎల్.ఎస్.యం.రమాశ్రీని ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు.అనంతరం సంయూక్త రవాణా కమీషనర్ ఎల్. ఎస్ యం. రమాశ్రీ మాట్లాడుతూ సమాజంలో మహిళ తల్లి, చెల్లి, భార్య, బిడ్డగా ఎన్నో రూపాల్లో పోషిస్తున్న పాత్ర మరువలేనిదన్నారు. స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో అక్కడ దేవతాలు సంచరిస్తారని పేర్కొంటూ దైవానికి ప్రతి రూపం పడిలేగిసిన కెరటం స్త్రీమూర్తి అని అన్నారు. కుటుంబ బాధ్యతతో పాటు సామాజిక బాధ్యతతో రాణిస్తూ, మహిళ ముందుకు సాగుతుందన్నారు. మహిళలకుసమాజంలో వచ్చిన అవకాశలను అందుపుచ్చుకుంటు ప్రగతిపధంలో తిరుగులేని వ్యక్తిగా ఎదుగుతూ తన ఉనికినిచాటుకునేలా ప్రతి మహిళ అడుగులు వేయాలన్నారు. కుటుంబ వ్యవస్థలో మహిళగా అత్యంత బాధ్యత యుక్తంగాసేవలు అందించడంతో పాటు, అంతే బాధ్యత యుక్తంగా వృత్తి ఉద్యోగంలో సేవలు అందించి మహిళ శక్తిని నిరూపించుకోవాలని ఎల్.ఎస్.యం. రమాశ్రీ కోరారు.జోనల్ అధ్యక్షులు యం. రాజుబాబు మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర ఎంతో ఉన్నతమైందని ప్రేమ, సహనం, త్యాగం, మహిళలకే సొంతం అన్నారు. మమతానురాగాలకు మహిళ మారుపేరు అన్నారు.తనపై అధారపడి జీవిస్తున్న వారిని కంటికి రెప్పల కాపాడుకుంటూ వృత్తి ఉద్యోగాలలో రాణించి కుటుంబ వ్యవస్థను మరింత భుజాన వేసుకున్న స్త్రీ మూర్తికి పాదాభివందనం అన్నారు. సంయూక్త రవాణా కమీషనర్ ఎల్. ఎస్ యం. రమాశ్రీ అందిస్తున్న సేవలు రవాణాశాఖకు మణిహారంగా నిలుస్తున్నాయన్నారు. అటువంటి ఉన్నతమైన స్త్రీ మూర్తిని స్ఫూర్తిగా తీసుకున్ని ప్రతి మహిళ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని యం.రాజుబాబుసూచించారు.ఈ కార్యక్రమంలో జోనల్ కార్యదర్శి శ్రీమతి పి. విజయ, ఎస్ టి ఏ. ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎల్.వి.ఆర్. కిషోర్, కార్యదర్శి సిహెచ్ పైడిరాజు, ఎస్సి ఎస్టి ఉద్యోగుల సంఘం కోశాధికారి శ్రీమతి జె. ఆశాదేవి,ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.