ప్యాపిలి ( తెలుగు తేజం ప్రతినిధి ):అతిసార వ్యాధి ప్రభల కుండా,సీజినల్ వ్యాదులు, ఆరోగ్య కార్యక్రమాల పై వైద్య సిబ్బంది, ఆశ లతో ప్యాపిలి వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలం మొదలవుతుంది కాబట్టి కలుషితమైన నీరు త్రాగడం కoటమినేట్ ఆహరం తినడం ద్వారా వాటర్, ఫుడ్ బోర్న్ డిసీసెస్ అతిసారా,డైసెంట్రీ, అమీబియాసిస్ టైఫాయిడ్, హెపటైటిస్ వ్యాదుల ప్రభలే అవకాశం ఉంది కాబట్టి నీళ్ళ వీరేచనాలు అయిన వెంటనే ఓ ఆర్ ఎస్ ద్రావణం త్రాగించి,డిహైదడ్రెషన్ ను గమనించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము నకు పంపవలెనన్నారు .ప్రతి బుధవారం ఎం ఎల్ ఎచ్ పి లు వాటర్ టెస్టింగ్ చేయాలనీ ,క్లోరీనేషన్ నీటిని,కాచి చల్లార్చి వడబోసిన నీటిని త్రాగాలని, వేడి వేడి ఆహార పదార్థాలను భుజించాలని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించడం జరిగింది. కుక్క కరచిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఏ ఆర్ వి 4 టీకాలు వేయించు కోవాలని ఆసుపత్రి కి పంపాలన్నారు .ఆరోగ్య విద్యా భోదకుడు రాఘవేంద్ర గౌడు మాట్లాడుతూ దోమల వృద్ధిని అరకట్టే పద్ధతులను ప్రజల కు తెలిపి చైతన్య వంతులను చేసి దోమ కాటు ద్వారా వచ్చే మలేరియా, డెంగీ వ్యాదులు రాకుండ చేయాలని . హైపర్ టెన్షన్ నివారణ కోసం 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు బీ పి పరీక్ష చేయించుకునే లా చూడాలని , బీ పి ఉంటే క్రమం తప్పకుండ మందులు వాడాలని తెలియజేయాలన్నారు .ఈ కార్యక్రమం లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విజయకుమారి, మనోహర్ రెడ్డి, మల్లికార్జున, రోజ, ఎం ఎల్ ఎచ్ పి లు, ఏ ఎన్ ఎం లు, ఆశలు పాల్గొన్నారు.