2 ప్లొక్రెన్ లు పది ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
తెలుగు తేజం, చందర్లపాడు : కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారి వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు నందిగామ డి.ఎస్.పి నాగేశ్వర్ రెడ్డి సారధ్యంలో నందిగామ రూరల్ సీఐ సతీష్ చందర్లపాడు ఎస్సై మణికుమార్ వారి సిబ్బందితో కలిసి చందర్లపాడు మండలంలోని కాసరబాద్ గ్రామంలో అక్రమంగా డంపింగ్ చేసి, రవాణాకు సిద్ధంగా ఉన్న 400 టన్నుల ఇసుకను, రెండు ప్లొక్రెన్ లను, 10 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు నందిగామ రూరల్ సీఐ సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ సతీష్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది లోపల రహదారి నిర్మాణం అంటూ ఏపీ ఎం డి సి సిబ్బంది ఎవరు లేకుండ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని రాబడిన సమాచారంతో ఈ దాడులు నిర్వహించడం జరిగిందని, ఇసుక అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారైనా సరే సహించేది లేదని చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.