Breaking News

అక్రమ మద్యం పై ఉక్కుపాదం అడిషనల్ యస్పి వకుల్ జిందాల్

తెలుగు తేజం వత్సవాయి : వత్సవాయి మండల పోలిస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం తెలంగాణా రాష్ఠ్రం నుండి తరలిస్తున్న వారిని స్పెషల్ బ్రాంచ్ వారు పట్టుకున్నారు.పట్టుకున్న మద్యం బాటిల్స్ లను వత్సవాయి పోలీస్ కార్యాలయం ముందు మద్యం బాటిల్స్ ను చూపించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ యస్పి వకూల్ జిందాల్ ఐపియస్ అధికారి పాల్గొని మాట్లాడుతూ 1020 బాటిల్స్ ను తెలంగాణా నుండి అక్రమంగా తరలిస్తున్న 4 గురి వ్యక్తులను వారితో పాటు మరో ఇద్దరిని అదుపులో తీసుకున్నట్లు ఆయన తెలియజేసారు.అక్రమ మద్యం తరలిస్తే ఎంతటి వారినైన ఉపేక్షించేది లేదని ఆయన తెలియజేసారు.ఈ కార్యక్రమంలో సిఐ చంద్రశేఖర్,ఎన్ఫోర్స్ మెంట్ అదికారి ములళీ కృష్ణ,వత్సవాయి యస్ఐ సోమేశ్వరరావు లు పాల్గొన్నారు. 

About The Author

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *